Saturday, September 6, 2025

ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా..?: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా..? అని ఎక్స్ వేదికగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా..? అని నిలదీశారు.యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు.ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గమిది అంటూ ఎక్స్‌లో వీడియోను పోస్టు చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. పాలకుల మెప్పుకోసం ప్రజలను ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అధికారులను హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News