Friday, May 23, 2025

కెసిఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ లేఖను కూడా సరిగా రాయలేక పోయారని మంత్రి కోమటిరెడ్డి ( komati Reddy)వెంకట రెడ్డి విమర్శించారు. లేఖకు, ఎమ్మెల్సీ కవితకు సంబంధమే లేదని కోమటిరెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసింట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి కవిత పేరుతో లేఖ (MLC kavitha letter) రాశారని అన్నారు. కోమటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసునని చెప్పారు. 20 లేదా 30 సీట్లలోనే బిఆర్ఎస్ పోటీ చేస్తుందని, బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలుస్తుందని జోస్యం చెప్పారు. వందేళ్లయినా కెసిఆర్ కుటుంబం కలిసే ఉంటుందని, కెసిఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకే లేదని, ఇక మా సిఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. వరంగల్ లో కెసిఆర్ పెట్టిన సభ తాను ఒక్కడినే పెట్టగలనని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News