Friday, May 23, 2025

కవిత లేఖ కలకలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, తన తండ్రి కెసిఆర్ తీరుపట్ల ఎంఎల్‌సి కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరు పై ఆమె నేరుగా కెసిఆర్‌కే ప్రశ్నలు సంధించా రు. ఎంఎల్‌సి కవిత పే రుతో రాసిన ఓ లేఖ గు రువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రింది. డాడీ అంటూ వరంగల్‌లో జరిగిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పాజిటివ్, నెగెటివ్ అంశాలను ప్ర స్తావించారు. పహల్గా మ్ అమరులకు నివాళి, బిఆర్‌ఎస్ సభతో కేడ ర్ బలపడటం, పోలీసులకు వార్నింగ్ ఇవ్వ డం వంటివి బాగున్నాయ ని, అదే సమయం లో ఎస్‌సి వర్గీకరణ, బిసిల కు 42 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్ బిల్లు వంటి అంశాలపై మౌనం, బిజెపి పార్టీపై తక్కువగా మాట్లాడటం, ఉర్దూ లో మాట్లాడకపోవడం ప్రతికూలంగా మారిందని, బిజెపిపై ఇంకా బలంగా మాట్లాడితే బా గుండేదని లేఖలో ఉన్నది. అయితే ఈ లేఖ ఎం ఎల్‌సి కవిత రాశా రా..? లేదా అనే అంశంపై స్పష్టంత రావాల్సి ఉంది. ఆమె అమెరికా పర్యటనలో ఉండగా, ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అంశంపై వివరణ ఇచ్చేందుకు కవిత అందుబాటులో లేకపోవడం, ఆ లేఖ చే తిరాతతో ఉండటం, కవిత తన సోషల్ మీడి యా అధికారిక ఖాతాలో పేర్కొనకపోవడం లేఖలో పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కవిత లేఖ ప్రకారం బిజెపితో బిఆర్‌ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ఆమె ప్రస్తావించారు. బిఆర్‌ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై ఆ లేఖలో సూటిగా ప్రశ్నలు సంధించారు. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బిజెపితో బిఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తు అంశంపై బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కూడా స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. బిజెపి మీద రెండు నిమిషాలే మాట్లాడారని.. ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని అభిప్రాయపడ్డారు. బిజెపిపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని, తాను కూడా బిజెపి వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ అనే వ్యాఖ్యలు లేఖలో ఉన్నాయి. బిజెపిని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. వరంగల్ సభ తర్వాత బిజెపితో బిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందని అన్నారు. బిజెపిని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. కాంగ్రెస్‌పై గ్రాస్‌రూట్స్‌లో నమ్మకం పోయిందని, బిజెపినే ప్రత్యామ్నాయం అనే ఆలోచనను మన కేడర్ చెబుతోందని పేర్కొన్నారు.

ఎంఎల్‌సి ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా.. బిజెపికి సహాయం చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని, కెసిఆర్ యాక్సెస్ దొరకడం లేదని, సెలెక్టివ్ యాక్సెస్ అని జెడ్‌పిటిసి, జెడ్‌పి చైర్మన్లు, ఎంఎల్‌ఎ స్థాయి నేతలు బాధపడుతున్నారని, అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి అంటూ లేఖలో సూచనలు చేశారు. వరంగల్ సభలో ఉద్యమ నేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదని అన్నారు. 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేదని లేఖలో కెసిఆర్‌కు సూచించారు. పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్‌కు నచ్చలేదని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి.. నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బి.ఫామ్స్ ఇవ్వాలని తెలిపారు. వరంగల్ సభలో ఉర్దూలో మాట్లాడలేదని, వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదని చెప్పారు. ఎస్‌సి వర్గీకరణ, బిసిలకు 42 శాతం అంశాన్ని విస్మరించారని పేర్కొన్నారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యాం అని, బిజెపిపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని ఎంఎల్‌సి కవిత పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖలో ప్రస్తావించారు.

లేఖలో నెగెటివ్‌గా పేర్కొన్న అంశాలు
1.సభలో బిజెపి ని టార్గెట్ ఎందుకు చేయలేదు..?
2.వక్ఫ్ బిల్లు పై ఎందుకు మాట్లాడలేదు..?
3.ఎస్‌సి వర్గీకరణ పై ఎందుకు మాట్లాడలేదు..?
4.బిసి 42 శాతం రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు?
5. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?
6.బి.ఫాం మీరు స్వయంగా ఎందుకు ఇవ్వడం లేదు?
7.క్యాడర్‌తో మీరు ఎందుకు మాట్లాడటం లేదు?
8.కాంగ్రెస్‌కు పోటీ మన నేతలే బిజెపి అని చెబుతున్నారు మీకు తెలుసా?
9.నేను అరెస్ట్ అయ్యాకనే పార్టీ పరువు పోయిందని మీరు నమ్ముతున్నారా?
10.ఉద్యమ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు?
11.అందరూ అనుకుంటున్నట్లుగా బిఆర్‌ఎస్, బిజెపి పొత్తు వుంటుందా?
12.కొందరితనే అందుబాటులో వుంటున్నారు ఎందుకు?
13.హరీష్ రావు కట్‌అవుట్ వరంగల్ సభలో ఎందుకు పెట్టలేదు?

పాజిటివ్ అంశాలు:

1.వరంగల్ సభ క్యాడర్‌కు భరోసా ఇచ్చింది
2.మావోయిస్టులపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ ఖండించారు సంతోషం
3.రేవంత్ రెడ్డి తిడుతున్నా మీరు ఒక్కమాట అనలేదు..హుందాగా ఉన్నారు బావుంది
4.అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని చెప్పడం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News