Monday, June 23, 2025

బీసీలకు 42 శాతం వాటా ఇవ్వాల్సిందే!

- Advertisement -
- Advertisement -

రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం క ల్పించేలా స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తె లంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరైన వాటా ఇవ్వాలని, కేంద్రం పై నెపం వేసి తప్పించుకోవాలనుకుంటే బడుగుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఆదివారం విద్యానగర్ లోని బిసి భవన్ కు వచ్చిన కవిత, బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అర్. కృష్ణయ్యతో భేటీ అయ్యారు. బీసీల సమస్యలు, 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపై ఆయనతో ప్రత్యేకంగా చర్చించిన అనంతరం కృష్ణయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల హక్కుల కోసం చేస్తున్న ఉద్యమానికి మద్ధతు కోరడానికి వచ్చినట్టు చెప్పారు. గత 50ఏళ్లకు పైగా కృష్ణయ్య చేసిన, చేస్తున్న పోరాటా ల ఫలితంగానే బడగుల జీవితాలకు వెలుగులు వస్తున్నాయని గుర్తు చేశారు. కృష్ణయ్య బీసీల ఆశాజ్యోతి అని, బలహీన వర్గాల కోసం తెలంగాణ జాగృతి చేసే ఉద్యమానికి అండగా నిలవాలని కోరుతున్నట్టు చెప్పారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందు కు ప్రభుత్వం సన్నద్దమవుతుందని, రిజర్వేషన్లపై మంత్రులు తలో మాట మాట్లాడటంతోనే కోటా అంశం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందువల్ల నే బీసీల వాటా సాధనకు చేసే పోరాటానికి కలిసి రావాలన్నారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికలలో బీసీలకు చట్టపరమైన హామీతో రిజర్వేషన్లు కల్పించాలన్నా రు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్ విధానం అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టానికి అనుగుణంగా వెంటనే ప్రభుత్వ జిఓ జారీ చేసి ఎన్నికలు జరపాలన్నారు. బలహీ న వర్గాలకు మద్దతుగా పోరాటం చేయడానికి కవిత ముందుకు రావడం శు భపరిణామమని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ బోల శివ, జాగృతి కార్యదర్శి నవీన్ చారి, గొరిగ మల్లేష్ , రామకృష్ణ, అనంతయ్య , జిల్లా నరేందర్ పృద్విగౌడ్, రాందేవ్, మణికంఠ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News