హైదరాబాద్: భారత రాష్ట్ర సమితీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) వేటు వేసింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కవితను సస్పెండ్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్‌రావు ప్రకటించారు. కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం నివేదిక విషయంలో కవిత సోమవారం కవిత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని అగ్రనేతలపై ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై పార్టీ వేటు వేసింది.
కవిత (MLC Kavitha) కొంతకాలంగా బిఆర్‌ఎస్‌తో విబేధిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతున్నారు. తాజాగా కాళేశ్వరం నివేదిక విషయంలో పార్టీ నేతలు హరీశ్‌రావు, సంతోష్‌లపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హరీశ్‌రావు, సంతోష్‌లు వల్లే కెసిఆర్‌కు అవినీతి మరక అంటిందని ఆమె అన్నారు. కెసిఆర్‌పై కేసు పెట్టాక పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు, సంతోష్‌లు పలుమార్లు తనపై కుట్ర చేశారని ఆరోపించారు.
Also Read : హరీశ్ వల్లే కెసిఆర్ పై మరక