Monday, July 14, 2025

కవిత త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతుంది: తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -
  • కవిత తొత్తుగా మారిన మేడిపల్లి సీఐ
  • ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) విమర్శలు

మన తెలంగాణ/బోడుప్పల్: ప్రభుత్వ పెద్దలపై తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) విమర్శలు చేశారు. బిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలిపి తననే విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వాగతించలేదని.. కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని.. ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తుందని మల్లన్న (Teenmaar Mallanna) ఆరోపించారు. ఇటీవల ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడే కవిత సైతం మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉండేదని.. ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని జోస్యం చెప్పారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ రాకంటే ముందే కవిత సంబరాలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెకు అండగా నిలవడం చూస్తుంటే కవిత కాంగ్రెస్ ములాకత్ కావడం అని స్పష్టమవుతుందన్నారు. మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని, తనపై దాడి జరిగితే తనపైనే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. సిఐ గోవింద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిసిపికి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ విషయంపై బిసి కమిషన్ సైతం స్పందించిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News