- Advertisement -
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత పనులవల్ల బిఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. వివేకానంద మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి నష్టం చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని నిర్ణయం తీసుకున్నారని, తప్పు చేస్తే కుటుంబసభ్యులనైనా సహించనని కెసిఆర్ గతంలోనే చెప్పారని తెలియజేశారు. కన్న బిడ్డ కంటే కష్టంలో పార్టీకి అండగా ఉన్నవారే ముఖ్యమని చాటారని, పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదన్న విషయం స్పష్టమైందని వివేకానంద పేర్కొన్నారు.
Also Read : బిఆర్‌ఎస్ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ కవితపై వేటు
- Advertisement -