Friday, August 29, 2025

నిరుపేద కుటుంబంలో ఆణిముత్యం… మోడెం వంశీ

- Advertisement -
- Advertisement -

పవర్ లిప్టింగ్‌లో సత్తా చాటిన మోడెం వంశీ
బంగారు పతాకంతో దేశానికి గర్వ కారణం
దాతల సహాయంతో అంతర్జాతీయ స్థాయికి
మనతెలంగాణ/వాజేడు: ఉత్తర అమెరికా దేశమైన కోస్టారికలోని శాన్‌జోస్ లో ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు జరుగుతున్న ప్రపంచ జూనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంఫియన్ షిప్‌లో మోడెం వంశీ బంగారు పతాకం సాధించి భారత దేశానికి కీర్తి తెచ్చారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయితీలోని ఇప్పగూడెం గ్రామానికి మోడెం వంశీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వంశీ ఈ విజయం సాధించడం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తర అమెరికాలో జరిగిన ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో వంశీ 66 కిలోల విభాగంలో 680 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. కష్టాలను ఎదురొడ్డి నిలిచి చిన్నతనం నుంచి పవర్ లిఫ్టింగ్ అంటే ఎంతో ఇష్టపడే వంశీ ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ బతికే అతని తల్లిదండ్రులు మోడెం మోహన్ రావు, లక్ష్మీ కొడుకు పట్టుదలను చూసి అండగా నిలిచారు.

ఎన్నో కష్టాలను ఓర్చుకుని, రెక్కాడితే గాని డోక్కాడని పరిస్థితులలో కూలీ పనులు చేసి వచ్చిన డబ్బులతో వంశీ చదువు, పవర్ లిఫ్టింగ్ శిక్షణకు తోడ్పడ్డారు. వారి ప్రోత్సహంతో వంశీ ఎన్నో పోటీలలో పాల్గోని పతాకాలు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గోనేందుకు అవకాశం వచ్చింది. కానీ ఉత్తర అమెరికా వెళ్ళలంటే ఆర్ధిక స్తోమత లేక నిరుపేద కుటుంబం వంశీ ఈ ఖర్చులను భరించలేక పోయాడు. ఈ విషయం వంశీ మీడియా ద్వారా తెలియపరచడంతో పలువురు దాతలు స్పందించి అతనికి ఆధ్రిక సహాయం అందించారు. ఆ సహాయంతోనే వంశీ విదేశాలకు వెళ్ళి భారత దేశానికి గర్వకారణంగా నిలిచే బంగారు పతకం సాధించాడు. వంశీ విజయం ఎందరికో ముఖ్యంగా కష్టాలను ఎదుర్కోని విజయం సాధించాలనే వారికి మార్గదర్శకం అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మా కొడుకు మా ఊరికి పేరు తెచ్చాడు..
ఎన్నో కష్టాలను ఎదుర్కోని మా కొడుకును చదివించుకున్నాము. మా కొడుకు వంశీకి పవర్ లిఫ్టింగ్ పై ఉన్న మక్కువను గుర్తించిన మేము జిమ్ కు వెళ్ళేందుకు కూలీ నాలి చేస్తు వచ్చిన డబ్బులతో వంశీకి అండగా నిలిచాము. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గోని బంగారు పతకం గెలవడంతో చాలా సంతోషంగా ఉంది. బంగారు పతకం గెలవడమే కాదు మన దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, మా ఊరికి పేరు తెచ్చాడు. మా కొడుకు పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళేందుకు సరిపడ డబ్బులు లేకపోవడం ఆర్ధిక సహాయం అందించిన దాతలకు, మీడియా కు కృతఘ్నతలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News