ఆపరేషన్ సిందూర్ భారత కొత్త సాధారణ విధానం
త్రివిధ దళాల సమన్వయం అద్భుత్‌ంఅన్న మోదీ
న్యూఢిల్లీ: టెర్రరిస్ట్ లకు పాకిస్తాన్ లో దాగేందుకు ఇక చోటు లేదని ప్రధాని మోదీ (PM Modi)అన్నారు. సాయుధదళాలు వారు ఎక్కడదాగి ఉన్నా, టెర్రరిస్ట్ ల ఇళ్లలోనూ వెదికి వేటాడి దాడి చేస్తాయని ఆయన హెచ్చరించారు. ఘర్ మే ఘుస్ కే మారేంగే.. అన్నారు. ఉగ్రవాదులకే కాక, వారికి మద్దతు ఇచ్చే పాక్ సైన్యానికి కూడా గట్టి సమాధానం ఇవ్వడం ద్వారా భారతదేశం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిందని ప్రధాని అన్నారు. పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ (Adampur Air Base) లో వైమానిక యోధులను ఉద్దేశించి మోడీ (PM Modi) ప్రసంగించారు. ఏ పాకిస్తానీ సైన్యం పై భరోసాతో టెర్రరిస్ట్ లు రెచ్చిపోతున్నారో.. అలాంటి వారిని భారత సైనిక దళాలు తుడిచి పెట్టాయి.
పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయని ప్రధాని వెల్లడించారు.సాయుధ దళాల సాహసాలను ప్రశంసిస్తూ ప్రధాని పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లు ప్రశాంతంగా కూర్చుని ఊపిరి పీల్చుకునే జాగా కూడా లేదని పాకిస్తాన్ సైన్యానికి స్పష్టం చేశారని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం దూకుడు విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, మళ్లీ టెర్రరిస్ట్ లు తలెత్తితే, వారిని వారి ఇళ్లలోనే మట్టుపెడతాం, తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వం అని ప్రధాని అన్నారు. భారత ఆధునిక సైనిక సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ, మన డ్రోన్లు, క్షిపణుల గురించి ఆలోచిస్తే.. పాకిస్తాన్ కు కంటిమీద కునుకు కరవవుతుందని స్పష్టం చేశారు. సోమవారం దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఆపరేషన్ సిందూర్ భారత కొత్త సాధారణ విధానం అన్నారు.
నేడు ఇదే విషయాన్ని అదంపూర్ లో(Adampur Air Base) పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం గీసిన లక్ష్మణరేఖ ఏమిటో ఇప్పుడు స్పష్టమైంది. ఇప్పుడు మరో సారి టెర్రరిస్ట్ లు దాడి జరిపితే, చావు కొని తెచ్చుకున్నట్లే అన్నదీ స్పష్టమైంది. అని అదే భారతదేశం సమాధానం అని ప్రధాని హెచ్చరించారు. భారత త్రివిధదళాల శక్తి సామర్థ్యాలను ప్రధాని ఎంతగానో ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో త్రివిధ దళాల సమన్వయం అద్భుతం. నావికాదళం సముద్రంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సైన్యం సరిహద్దులను బలోపేతం చేసింది, వైమానిక దళం దాడులతో పాటు రక్షణనూ సాధించింది. బీఎస్‌ఎఫ్, ఇతర దళాలు అద్భుతమైన సామర్థ్యాలను ప్రదర్శించాయి. అని పేర్కొన్నారు.