దేశంలోని ప్రధాన మీడియా ప్రస్తుతం రెండు అంశాలను తీవ్రంగా చర్చిస్తున్నవి. ఒకటి కాశ్మీరులోని పహ ల్గంలో ఉగ్రవాద హంతకముఠా అమాయకులను అమానుషంగా చంపిన సంఘటన కాగా రెండోది మావోయిస్టులని ఏరి వేయటానికి వేలాదికేంద్ర బలగాలు కర్రిగుట్టలను దిగ్బంధం చేసిన విషయాలనే జనం గురించే చర్చించుకుంటున్నారు. రెండీంటిని ఒకే ఘాట కట్టలేము. కాశ్మీర్లో జరిగిన కిరాతకం నిర్ధాక్షిణ్యంగా అణచివేయాల్సింది. వారితో చర్చలు అంటూ ఏమీ లేవు వారు విదేశీ శత్రువులు.కానీ మావోయిస్టు సమస్య అలాంటిది కాదు. మావోయిస్టులు మన పౌరులు.మన పౌర సమాజంలో వచ్చిన అసంతృప్తి, అన్యాయాలకు సంబంధించిందిన అంశాలపై వారు పోరాడుతున్నారు. వారి సమస్య మన పరిధిలో ఉన్నదే. ఈ మధ్యకాలంలో మావోయిస్టులు కూడా తమ పోరాటాన్ని ఆపి ప్రభుత్వంతో చర్చలకు రావటానికి సిద్ధపడటం అనేది ఒక మంచి పరిణామం. దీని నందిపుచ్చుకొని ప్రభుత్వం సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచటానికి దోహదపడాలని అందరూ కోరుకుంటున్నారు.
మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మావోయిస్టుల ప్రధాన కేంద్రాలను వేలాదికేంద్ర బలగాలు చుట్టుముట్టాయని, వారు ప్రస్తుతం స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్న కర్రెగుట్టలను పూర్తిగా కేంద్రబలగాలు స్వాధీ నం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 40 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. మావోయిస్టు ముఖ్య నాయకత్వం అంతా దిగ్బంధంలో ఉ న్నట్లు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళనతో జనాలు ఎదురుచూస్తున్నారు. మావోయిస్టులకుగత రెండు మూడు నెలలుగా మధ్య భారత దేశం లో భద్రతా దళాలకు మరియు మావోయిస్టుల మధ్య జరుగుతున్న కౌంటర్లు, ఎన్కౌంటర్లు పెద్ద చర్చనీయంగామారినవి. చత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , ఝార్ఖం డ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వారానికి ఒకటో రెండో ఎన్కౌంటర్లు అవుతున్నవి. ఇరవై ముప్పై మంది మావోయిస్టులు మరియు మావోయిస్టులను బలపరుస్తున్న ఆదివాసులు చనిపోవడం జరుగుతుంది. 2026 మార్చి 31 నా టికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటనలు చేస్తున్నాడు. నక్సలైట్లు ఇంత కిష్టమైన పరిస్థితిని చరిత్రలో ఎప్పుడు ఎ దుర్కోలేదు. ఇంత రక్షణ స్థితిలోకి నెట్టబడిందీ లేదు.
అయితే ఈ పరిణామాలన్నింటితో బాగా నష్టపోతుం ది మాత్రం ఆదివాసీలే. మావోయిస్టు దళాలలో ఎక్కువగా ఉన్నది ఆదివాసీలే .కాబట్టి చనిపోయిన వారిలో కూడా వారే ఎక్కువగా ఉంటున్నారు. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనే పేరిట మావోయిస్టులు కూడా అనేకమంది ఆదివాసులనే చంపారు. కేంద్ర బలగాల మరియు మావోయిస్టుల రణరంగ క్షేత్రం మాత్రం దండకారణ్యమే. అక్కడి నివసించే వారిలో నూటికి 90 మంది ఆదివాసీలే. వారు అత్యంత పేదరికంతో నిరక్షరాస్యతతో అనారోగ్యాలతో అభివృద్ధి లేక అనాగరికంగా జీవిస్తున్నారు. మావోయిస్టుల ప్రవేశంతో ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యే కంటే ఆటంకాలే అధికమయ్యాయి. ఎవరో కొంతమంది మావోయిస్టుల్లో చేరి కొంత చైతన్యం అయినా అత్యధికులు భయంతోనో ప్ర భుత్వ సహాయం పొందటం కొరకో బిజెపికి అలుకూలురు గా మారారు. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో దండకారణ్యంలో ఉన్న అనేక నియోజకవర్గాలలో బిజెపి గెలవటాన్ని బట్టి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆదివాసుల జీవితాలలో పెద్ద మార్పు లేదు. పైగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా వారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నవి.
ఈ పరిస్థితిని గమనించి పౌర సమాజంలో ఉన్న మే ధావులు, సామాజిక ఉద్యమకారులు, పౌర హక్కుల నా యకులు, కవులు, రచయితలు ప్రభుత్వానికి మావోయిస్టు నాయకత్వానికి మధ్యవర్తిత్వం వహించి ఈపరిస్థితి మా ర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు జస్టిస్ చంద్ర కుమార్ నాయకత్వాన్ని ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు స్పందించి తాము కాల్పులు విరమణ చేస్తామని అవసరమైతే ఆయుధాలు విసర్జన పై కూ డా చర్చిస్తామని ప్రకటించడం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అంది పుచ్చుకొని మావోయిస్టుతో గౌరవప్రదమైన చర్చలు చేసి వారిని ప్రజాతంత్ర ఉద్యమంలోకి రావడానికి అవకాశం కల్పిస్తే బాగుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉంది.
ఈ సందర్భంగా నేను మావోయిస్టులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని అదేవిధంగా మావోయిస్టులు సాయు ధ పోరాటాన్ని విసర్జించి ఎన్నికల్లో పాల్గొనాలని వీడియోలలో మాట్లాడుతూ చెప్పాను. పత్రికల్లో వ్యాసాలు రాశా ను. సోషల్ మీడియాలో కూడా చర్చల్లో పాల్గొన్నాను. ఎ న్నికల్లో పాల్గొనమని నేను మావోయిస్టులు అడిగినందుకు చాలా మంది నాపై విమర్శలు చేస్తున్నారు. నన్ను విమర్శించే వారు ఎన్నికల గురించి మారక్స్, ఎంగేల్స్, లెనిన్, మావో తదితర మార్చిస్టు మహోపాధ్యాయులు ఏం చెప్పా రో ఒకసారి పరిశీలిద్దాం. 1848లో జర్మనీ చక్రవర్తి ఎన్నికల్లో కార్మిక వర్గం పాల్గొనలా? వద్దా? అన్న సమస్య ఎదురైనప్పుడు, భూస్వామ్య ప్రతినిధులు ఓడించటానికి బూ ర్జువా ప్రతినిధులకే ఓటు వేయాలంటాడు మార్క్స్.
1850 లో కమ్యూనిస్టు లీగ్ ఆమోదించిన పత్రాన్ని చూద్దాం. -21 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి. -ఎన్నికైన పార్లమెంటు సభ్యులకు వేతనాలు ఇవ్వాలి. -కార్మిక వర్గం ఖచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగాల్సిందే అని ఆ పత్రం పేర్కొన్నది. -ఎన్నికలను బహిష్కరించమని చెప్పటం అంటే బుర్జువా రాజకీయ పార్టీల కౌగిలిలోకి కార్మిక వర్గాన్ని పంపటమే అంటారు . అన్ని దేశాలలో కార్మిక వర్గ పార్టీలు ఏర్పడుతున్నాయి. ఎన్నికల వ్యవస్థలు వస్తున్నాయి.గెలిచినా ఓడినా అన్ని స్థానాల్లో కార్మిక వర్గం పోటీ చేయాలి అంటారు. చైనా విప్లవం 1921 ల ప్రారంభమై 1949 వరకు జరిగింది. వేలాదిమంది శత్రు సైన్యం తో చనిపోవడం జరిగింది .అనారోగ్యాలతో ప్రాణాలు కో ల్పోవడటం జరిగింది. లాంగ్ మార్చ్ జరుగుతున్న సందర్భంగా మావోను అమెరికా జర్నలిస్టు ఎడ్గార్ స్నో ‘ఇన్ని ప్రాణాలు కోల్పోకుండా విప్లవం సాధ్యం కాదా‘ అని మా వోని అడుగుతాడు. అప్పుడు మావో ‘మీ దేశం, బ్రిటన్, ఫ్రాన్స్ ,ఇటలీ తదితర యూరప్ దేశాల్లో ఉన్నట్టుగా మాకు కూడా ఎన్నికలు ఉన్నట్లయితే ఇంత రక్తపాతం జరగాల్సిన అవసరం ఏముండేది.
ఇన్ని ప్రాణాలు పోవాల్సిన అవస రం ఏముండేది’. దేశంలో ఎన్నికల వ్యవస్థ లేనందుకు ఈ పరిస్థితి నెట్టబడ్డామని ‘ఎడ్గార్ స్నోతో చెప్పింది ‘చైనాపై అరుణతార ‘అనే పుస్తకంలో ఎడ్గార్ స్నో యే రాసింది గమనించవచ్చు. మార్క్సిస్టు మహోపాధ్యాయులంతా ఎన్నికల్లో పాల్గొంటాన్ని వ్యతిరేకించలేదు పైగా పాల్గొనాలని చెప్పారుప్రస్తుత పరిస్థితులలో నాకు మారక్స్,ఎంగిల్స్, లెనిన్, మావో చెప్పింది రైట్ అనిపిస్తుంది .మీకు తప్పనిపించవచ్చు .వాస్తవాలు కూడా నేను విధంగానే ఉన్నాయి కదా ?ఇప్పుడు మావోయిస్టులు మేము బూర్జువా ప్రభుత్వాలతో చర్చిస్తాము అని అంటున్నారంటే దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి ?మావోయిస్టులు భయపడి, ప్రాణాలు రక్షించుకోవటానికి శాంతి చర్చలు కావాలనుకుంటున్నారా? రాజ్యాధికారం కావాలని బయలుదేరిన వాళ్లు అనివార్యంగా వెనక్కి ఎందుకు రావాల్సి వస్తుంది?. అదే కదా మనం ఆలోచించాల్సింది .
ఎన్నికల్లో కూడా మనం ఎలా గెలవాలని మనం ఆలోచించాలి కదా !.ప్రజలందరూ ఎన్నికలను ఎందుకు ఆమోదిస్తున్నారు ?అర్థం చేసుకోవాలి కదా !?.
ఇంకా పాతకాలపు ఆలోచనలతోనే ఉంటే ఎలా? మారిన ప్రపంచాన్ని అర్థం చేసుకొని మనం మారకపోతే ఎలా? నేపాల్ అనుభవాలు, శ్రీలంక అనుభవాలు, లాటిన్ అమెరికా దేశాల అనుభవాలు ఏం చెప్తున్నాయో మనం నేర్చుకోవటానికి సి ద్ధంగా లేకపోతే ఎలా? మావోయిస్టులను నేను పిరికివాళ్లనుకోవడం లేదు. త్యాగమూర్తులుగానే భావిస్తా. అంతకైతే వాళ్ళ ఆలోచన విధానంలో తప్పు ఉంది. అది వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. అలా గుర్తించడం తప్పా? మత మూడస్తులలాగా మా బైబిల్ ఇలా చెప్పింది ,మా ఖురాన్ ఇలా చెప్పింది , భగవద్గీత ఇలా చెప్పలేదు అంటూ సనాతన వాదులులాగా ఉండాలని మీరు భావిస్తున్నారా? మార్క్సిజం అంటే నిరంతరం మార్పులకు అనుగుణంగా మార్పు చెందే సైన్స్. జడ పదార్థం కాదు. మేం పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా ఉండకూడదు. రాచరికము, నియంతృత్వం, ప్యాసిజం ఉన్నప్పుడు, ఎన్నికలు లేనప్పుడు, సాయుధ పోరాటం అనివార్యమైన ఏకైక మార్గం. అప్పుడు ఇంకా ఏమి ఆలోచించినా తప్పవుద్ది. ప్రజలూ నివార్యమైందిగా భావిస్తారు. ఇప్పుడు ప్రజలకు ఎన్నికల నే ప్రత్యామ్నాయంగా కనబడుతుంది. అది ఫలితం ఇవ్వని రోజున వారంతట వారే తగు నిర్ణయాలు తీసుకుంటారనే విశ్వాసం మనకు ఉండాలి.
అది కోల్పోయినప్పుడే ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఎన్నికలు లేనప్పుడు ఎన్నికలు కావాలని పోరాటం చేయడం కూడా విప్లవమే. అందుకే మారక్స్, ఎంగిల్స్, లెనిన్, మావోలు ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పారు. రాజ్యాధికార సాధనకి ఏకైక మార్గం సా యుధ పోరాటమే అనుకుంటే అది ఎప్పుడైనా చేయొచ్చు అనుకుంటే మరి మార్క్, ఎంగిల్స్ లే మరో ఇద్దరినో ము గ్గుర్నో జత చేసుకొని, ఒక దళంగా ఏర్పడి సాయిధ పోరాటం చేయాల్సి ఉండేనా? అలా చేయనందుకు వాళ్ళు పిరికి వాళ్ళా? లేదా రిజినిస్టులా? తుపాకీ పట్టిన వాడే విప్లవకారుడు, తుపాకీ పట్టటమే కాదు..
వర్గ శత్రువు కంఠా న్ని తెగగోసి, ఆ రక్తంతో చేయి ముంచి ‘మావో జిందాబా ద్’, ‘విప్లవం వర్ధిల్లాలి’అని రాసిన వాళ్ళే విప్లవకారులు అ న్న రోజులు లేవా? అవన్నీ మార్చుకుంటూ రాలేదా? ఇ ప్పుడు వాళ్లు మారడాన్ని ఆహ్వానిద్దాం. అందుకే కేంద్ర ప్ర భుత్వం మావోయిస్టుతో చర్చలు జరిపి మావోయిస్టులని బ యటికి రావడానికి తోడ్పడాలని కోరుకుందాం. ఇది జరుగుతే, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరున్న మన భారత దేశ ప్రజాస్వామ్యాని మరింత ప్రతిష్ట పెరుగుతుంది. ప్రజాస్వామ్యం మరింతగా పటిష్టపడుతుంది. మావోయిస్టులు బయటకు వచ్చిన తర్వాత, వారు ఎన్నికల్లో పాల్గొని శ్రీలంక, నేపాల్, లాటిన్ అమెరికా దేశాల లాగా వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహిస్తారని ఆశిద్దాం.
జి.రాములు, 94900 98006