Thursday, July 17, 2025

వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి మోడీ: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

- Advertisement -
- Advertisement -

ముంబై : వారంలో 100 గంటలు పనిచేసే బహుశా ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ మాత్రమేనని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలియజేశారు. నారాయణమూర్తితో కలిసి ముంబై బెంగళూరు విమానంలో దాదాపు రెండు గంటల పాటు ప్రయాణించగా, తమ మధ్య పనిగంటలపై చర్చ జరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ నుంచి పట్టణపాలనకు తయారీ, యువత నైపుణ్యాభివృద్ధి,నీతి నియమాలు, నాయకత్వం తదితర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. నారాయణమూర్తితో ఎక్స్‌లో షెల్ఫీ తీసుకున్న సూర్య “ లెజెండరీ నారాయణమూర్తితో స్ఫూర్తిదాయకమైన చర్చ జరిగింది.

భారత ఐటీ సేవల రంగానికి నారాయణ మూర్తి మార్గదర్శకత్వం వహించి, దానిని ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చారు. లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇన్ఫోసిస్ కారణమవుతోంది. ” ఎక్స్ ఖాతాలో సూర్య రాసుకొచ్చారు. సంభాషణ ఆఖరులో “ మీరు చెప్పిన వారానికి 70 గంటలు పనిచేయడానికి ప్రయత్నిస్తున్నా ” అని నారాయణమూర్తితో సరదాగా చెప్పానని తేజస్వి పేర్కొన్నారు. అందుకు “ నాకు తెలిసి వారానికి 100 గంటలు పనిచేసే వ్యక్తి ఒక్క ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ” అని ఆయన బదులిచ్చారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News