Saturday, July 19, 2025

2047 వరకు మోడీ అవసరం ఉంది: నిశికాంత్ దూబే

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతోనే బిజెపికి ప్రజలు ఓట్లు వేస్తున్నారని బిజెపి ఎంపి నిశికాంత్ దూబే పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత బిజెపి ముఖ చిత్రం మారిపోయిందని ప్రశంసించారు. వరుసగా మూడు సార్లు లోక్ సభ ఎన్నికలలో, అనేక రాష్ట్రాలలో మోడీ నేతృత్వంలో బిజెపి పాలన కొనసాగిస్తోందని కొనియాడారు. బిజెపిలో మోడీ లేకుంటే లోక్ సభ ఎన్నికలలో 150 సీట్లు గెలుచుకోవడం కష్టం అని దూబే తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి లేని రాష్ట్రాలలో కూడా ఈ రోజు పాలన కొనసాగడానికి కారణం మోడీనేనని మెచ్చుకున్నారు.

75 ఏళ్ల తరువాత బిజెపి నేతలు పదవీ విరమణ చేస్తారనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై నిశికాంత్ స్పందించారు. మోడీ శరీరం సహకరించినంతవరకు, అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతే.. మోడీ లక్ష్యమని గుర్తు చేశారు. ఆ లక్ష్యం చేరేవరకు మోడీ అవసరం భారత్ కు ఉందన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత పేదల్లో ఎక్కువ మందికి బిజెపిపై నమ్మకం ఏర్పడిందని, తమ పార్టీ నచ్చినవాళ్లు కూడా ఉన్నారని, అందరికీ నచ్చాలని ఏమీ లేదన్నారు. మోడీ లేకపోతే బిజెపి బలంగా ఉండేది కాదని తాను కార్యకర్తగా నమ్ముతున్నానని దూబే కుండబద్దలు కొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News