Sunday, May 4, 2025

బిజెపితో స్నేహం చేయాలని కెసిఆర్ తపించారు: మోడీ

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: తెలంగాణలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ బిజెపి సభలో మోడీ ప్రసంగించారు. పెరుగుతున్న బిజెపి శక్తిని కెసిఆర్ చాలా కాలం క్రితమే గుర్తించారని, అందుకే ఎలాగైనా బిజెపితో స్నేహం చేయాలని తపించారన్నారు. ఒకసారి ఢిల్లీ వచ్చి తనతో అదే విషయం మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల అభీష్ఠానికి వ్యతిరేకంగా వ్యవహరించమని, అప్పటి నుంచి తనని తిట్టడం బిఆర్‌ఎస్ పనిగా పెట్టుకుందని మోడీ మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ను బిజెపి దగ్గరకు కూడా రానివ్వదని హెచ్చరించారు. డిసెంబర్ 3న ఫామ్‌హౌస్ సిఎం ఓడిపోతున్నారని  జోస్యం చెప్పారు. మూఢనమ్మకాలకు ఫామ్‌హౌస్ సిఎం బానిసగా మారాడని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తానని మోడీ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News