Tuesday, May 6, 2025

రూ.కోటి ఇవ్వకుంటే చంపేస్తాం.. పేసర్ షమీకి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి బెదిరింపులు రావడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఐపిఎల్ ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న షమీకి ఓ అగంతకుడు ‘కోటీ ఇస్తావా.. చస్తావా’ అంటూ బెదిరింపు మెయిల్ పెట్టాడు. షమీని బెదిరించి భయపెట్టి డబ్బు రాబట్టాలను చూసిన సదరు వ్యక్తి పేరు రాజ్‌పుత్ సికిందర్. అతడు ఆదివారం సాయం త్రం మెయిల్ పంపి రూ. కోటి డిమాండ్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన షమీ సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చచేసుకున్న అమ్‌రోహా పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అగంతకుడు కర్నాటకు చెందిన యువకుడగా గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాలనుకుంటున్నట్టు వారు తెలిపారు. కాగా, షమీ ఐపిఎల్ 18లో సన్‌రైజర్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. అనుకున్నంతగా రాణించలేక పోతున్నాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచుల్లో 8,63 సగటుతో కేవలం ఆరు వికెట్టు మాత్రమే పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News