Monday, September 15, 2025

‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..

- Advertisement -
- Advertisement -

హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారట. ఆన్ లొకేషన్ స్టిల్స్‌లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది.

‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ చాలా విషయాలు చెప్పేసింది. ఆ వెంటనే నాలుక కరుచుకుంది. పొరపాటున చెప్పేశాను ఏం పర్లేదు కదా అంటూ పక్కనే ఉన్న మంచు మనోజ్‌ను అడిగింది. ఇలాంటివి నీకు అలవాటే కదా అన్నట్టు మంచు మనోజ్ నవ్వేశాడు. మంచు లక్ష్మి నటించిన ‘దక్ష’ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఆ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇలా ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు ఉన్న విషయాన్ని బయటపెట్టేసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 26, 2026లో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News