Wednesday, July 2, 2025

వెండితెరపైకి మరో స్టార్ హీరో కుమార్తె.. సినిమా టైటిల్ ఏంటంటే..

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోల కుమారులు లేదా కుమార్తెలు వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం చాలాకాలంగా వస్తున్న సాంప్రదాయమే. మన టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని సినీ పరిశ్రమల్లో ఈ పద్ధతి నడుస్తోంది. తాజాగా మరో స్టార్ హీరో కుమార్తె వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ (Mohan Lal Daughter) సినీ అరంగేట్రం చేసేందుకు సర్వం సిద్ధమైంది. ‘తుడక్కమ్’ అనే చిత్రంతో ఆమె పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘డియర్ మాయాకుట్టి, ‘తుడక్కమ్’ నీ ప్రయాణంలో మొదటి అడుగు కావొచ్చు. కానీ, జీవితాంతం కొనసాగే బంధం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే మోహల్‌లాల్ కుమారుడు ప్రణవ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. ‘హృదయం’ అనే సినిమాతో ప్రణవ్ పెద్ద హిట్‌ని అందుకున్నారు. ప్రస్తుతం అతడు ‘డైస్ ఐరే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ‘భ్రమయుగం’ సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ దీనికి దర్శకుడు. ఇప్పుడు మోహన్‌లాల్ కుమార్తె (Mohan Lal Daughter) కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండటంతో ఆయన అభిమానులు డబుల్ హ్యాపీ అవుతున్నారు.

ఇక ‘తుడక్కమ్’ సినిమా విషయానికొస్తే.. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మిస్తున్నారు. జుడే ఆంథోని గతంలో ‘సారస్’, ‘2018’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ‘తుడక్కమ్’కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News