మేషం – ప్రతిబంధ కాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టులు, లైసెన్సులు లాభిస్తాయి.
వృషభం – వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. దైవానుగ్రహం వెన్నంటే రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. విభేదాలు తారస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి.
మిథునం – వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు.
కర్కాటకం – ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ మార్గాలను సాధించడానికి మీరు చేసే కృషి నామమాత్రపు ఫలితాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
సింహం – వాయిదా చెల్లింపుల పద్ధతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి గాను నిర్ణయాలు తీసుకుంటారు. సంస్థపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు.
కన్య – విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు. అన్ని పనులలో కూడా చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు,
తుల – ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు వృత్తి ఉద్యోగాలపరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం – శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి. ఊరటను కలిగించే విలువైన సమాచారాన్ని అందుకుంటారు.కీలకమైన వ్యవహారాలలో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
ధనుస్సు – ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులను కూడా మీరు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
మకరం – రావలసిన ధనం చేతికంది వస్తుంది.అయితే అంతకు మించిన చెల్లింపులను మీరు చెల్లించవలసి రావడం కష్టతరంగా పరిణమిస్తుంది. కొంత మానసిక అశాంతి, అలసట ఏర్పడుతుంది.
కుంభం – శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టుతారు. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి గాను అవిశ్రాంతంగా కృషి చేస్తారు. మానసిక సంఘర్షణకు గురవుతారు.
మీనం – స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపచేస్తాయి. పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యం చెందుతారు.
Monday rasi phalalu
Monday rasi phalalu