- Advertisement -
హైదరాబాద్: దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు (Monsoon) శనివారం కేరళను తాకాయి. ఎనిమిది రోజుల ముందే ఈ రుతువనాలు దేశంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఇవి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. ఈ కారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు (Monsoon) పలకరిస్తుంటాయి. కానీ, ఈసారి 8 రోజుల ముందుగానే వచ్చాయి. ఇలా అంచనాల కంటే ముందే రుతుపవనాలు రావడం 16 సంవత్సరాల్లో ఇదే తొలిసారి.
- Advertisement -