Wednesday, July 2, 2025

పేరు మార్పు ఇక ఆన్‌లైన్‌లోనే

- Advertisement -
- Advertisement -

జీహెచ్‌ఎంసితో మరిన్ని ఆన్‌లైన్‌సేవలు
ప్రాపర్టీ ట్యాక్స్ పునఃపరిశీలన కూడా
మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ ప్రజలకు జీహెచ్‌ఎంసి సేవలు మరిన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. మునిసిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే ఇబ్బందులను ఒక్కొక్కటిగా జీహెచ్‌ఎంసి తొలగిస్తూ వస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా జీహెచ్‌ఎంసి ప్రత్యేక సాంకేతిక వ్యవస్థలను వినియోగంలోకి తీసుకొస్తుంది. ఈక్రమంలోనే మరో ఆరు సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈపాటికే చెల్లింపులను, పలు విషయాలపై దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ పద్దతిని ప్రవేశపెట్టి అమలుపరుస్తోంది. ఇప్పుడు ఆస్తిపన్ను విషయాల్లోని చిన్నచిన్న పొరపాట్లకు కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసుకునే పద్దతికి జీహెచ్‌ఎంసి పుల్‌స్టాప్ పెట్టింది. జీహెచ్‌ఎంసిలోని రెవెన్యూ విభాగంలోని పలు సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకునే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది.

6 సేవలకు..
ఆస్తిపన్ను లేదా ట్రేడ్ లైసెన్సుకు సంబంధించిన మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడం, సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకునేందుకు, ఆస్తిపన్నులో లేదా ట్రేడ్ లైసెన్స్‌లో పేరు మార్పు లేదా పేరును సరిచేయడం, ప్రాపర్టీ ట్యాక్స్ పునః పరిశీలన చేయడం, స్మశానవాటికల ఖాళీలపై, ఇంటి డోర్ నెంబర్ సరిచేయడం వంటి విషయాలపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని జీహెచ్‌ఎంసి ప్రవేశపెట్టింది. ఎవరైనా ఈ ఆరు సేవల్లో ఏదేని అవసరమున్నా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలును జీహెచ్‌ఎంసి కల్పించింది. మై జీహెచ్‌ఎంసి యాప్‌లో లేదా జీహెచ్‌ఎంసి అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాలపై దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లి, అధికారులు వచ్చే వరకు నిలిచి ఉండే విధానానికి పుల్‌స్టాప్‌పెట్టింది జీహెచ్‌ఎంసి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News