అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. (War 2’) ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్ 2’ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ భారీ పాన్- ఇండియా యాక్షన్ చిత్రాన్ని చూసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ (‘War 2’ teaser) దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.
ఇక తాజాగా వార్ 2 డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెప్పేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ ‘వార్ 2’ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.