Wednesday, July 16, 2025

భువనగిరిలో కారుతో ఢీకొట్టి భర్తను చంపించిన భార్య

- Advertisement -
- Advertisement -

ప్రియుడితో కలిసి ఘాతుకం
రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని
నమ్మించే ప్రయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు
(మోటకొండూర్)లో ఘటన
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య తన ప్రియుడు, తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది. యాదాద్రి ఎసిపి శ్రీనివాస్ నాయుడు తెలిపిన కథనం ప్రకారం..ఈనెల 14న మోటకొండూరు మండలం, కాటేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వస్తువుల స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే, మృతుడి బంధువులు హతుడి భార్య స్వాతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేయగా.. హత్యకోణం బయటపడింది. జిల్లాలోని ఆత్మకూరు మండలం, పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38)తో మోత్కూరు మండలం, దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పల్లెర్లలోనే ఉంటూ భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూం లో మేనేజర్‌గా స్వామి పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షోరూమ్‌లో పనిచేస్తోంది. తుర్కపల్లి మండ లం, పల్లెపహాడ్‌కు చెందిన సాయికుమార్‌తో స్వాతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు స్వాతివేసిన పథకం వేసింది. పల్లెర్లకు చెందిన తన స్నేహితుడు వీరబాబుతో కలిసి స్వామి భువనగిరికి వెళ్ళాడు. ఇద్దరూ బైక్‌పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. కారు.. బైక్‌ను 50 మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది. దీంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందగా, బైక్‌పై వెనక కూర్చున్న వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. భార్య స్వాతి తరపువారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబసభ్యులు మోటకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, అతని బావమరిది మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.

తన భర్త (స్వామి)ని అడ్డు తొలగించుకునేందుకు తన తమ్ముడు మహేష్, తనతో సన్నిహితంగా ఉండే సాయికుమార్‌తో కలిసి వీరబాబుతో వెళ్లిన తన భర్త స్వామి లొకేషన్‌ను మొబైల్ ద్వారా స్వాతి ట్రాక్ చేసింది. భువనగిరి నుండి పల్లెర్లకు వస్తున్న విషయాన్ని సాయి కుమార్‌కు స్వాతి చెప్పింది. భువనగిరిలో ఓ కారు అద్దెకు తీసుకొని స్వాతి తమ్ముడు మహేష్‌తో పాటు మరో స్నేహితుడు కలిసి సాయికుమార్ బయలుదేరారు. మోటకొండూరు మండలం, కాటేపల్లి వద్ద స్వామి బైక్‌ను కారుతో బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. పోలీసులు స్వాతి కాల్ డేటాతో అసలు నిజం బండారం బట్టబయలైంది. ఈ ఘటనలో స్వాతి, మహేష్, సాయికుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడు చీమల రామలింగ స్వామి పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News