Thursday, May 15, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ ప్రాజెక్టులో తల్లి, కొడుకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, నిజాంపేట మండలం, మునిగేపల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల (30), దార అక్షయ్ (8) అనే తల్లి, కొడుకు నిజాంపేట మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి ప్రాజెక్టు 20 గేట్లలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం మృతదేహాలు నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టే వారికి

కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ తమ పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను ఒడ్డుకు తీయించారు. మృతులను నిజాంపేట మండలం, మునిగేపల్లి గ్రామానికి చెందిన ప్రమీల, అక్షయ్‌లుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దార ప్రమీల భర్త దార సాయిలు 20 రోజుల క్రితం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రమీల జీవితంపై విరక్తి చెంది కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News