Friday, May 2, 2025

విద్యుదాఘాతంతో తల్లీకొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలం తుమ్మల సుగురు గ్రామంలో విద్యుదాఘాతానికి తల్లీకొడుకు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుమ్మలసుగురు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబానికి పిండి గిర్ని వ్యాపారం ఉంది. శ్రీనివాసులు కుమారుడు శ్రీకాంత్ చారి (15) గురువారం ఉదయం పిండి పట్టే క్రమంలో గిర్నికి విద్యుత్ సరఫరా కావడంతో శ్రీకాంత్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన తల్లి జయమ్మ కొడుకును కాపాడే క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ద్ధారించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జయమ్మ భర్త ఫిర్యాదు మేరకు తాడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News