నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఒక భవనం 13వ అంతస్తు నుంచి దూకి సాక్షి చావ్లా అనే 37 ఏళ్ల మహిళ, ఆమయె 11 ఏళ్ల వికలాంగ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసి ఇరుగుపొరుగువారు గగ్గోలు పెట్టారు. బిస్రాఖ్ స్టేషన్ నుండి పోలీసులు త్వరగా అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఇంట్లో భర్త దర్పణ్ చావ్లాను ఉద్దేశించి ఆమె రాసిన ఆత్మహత్య లేఖ లభించింది.
‘మేము ఇకపై మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. మా మరణానికి ఎవరూ బాధ్యులు కారు. మీ జీవితాన్ని మా ఉనికితో నాశనం చేసుకోకండి’ అని ఆ లేఖలో ఉంది. ఆమె కొడుకు చాలా కాలంగా మానసికంగా అనారోగ్యంతో ఉన్నందున, మందులు తీసుకుంటున్నాడని సమాచారం. తన జీవితం చాలా దుర్భరంగా తయారయిందని సాక్షి చెబుతుండేదని ఇరుగుపొరుగువారు తెలిపారు. వాస్తవానికి వారి కుటుంబం ఉత్తరాఖండ్‌లోని గర్హి నేగి గ్రామానికి చెందింది. వారు ఎంతో సౌమ్యులు, గౌరవంగా ఉండేవారని ఇరుగుపొరుగువారు తెలిపారు.