Friday, July 11, 2025

నలుగురు కుమారులున్నా ఆ తల్లి అనాథే!

- Advertisement -
- Advertisement -

నవ మాసాలు కని పెంచిన ఆ తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే ఆమె పట్టించుకోకుండా వదిలేశారు. చిన్నతనంలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడి ఏ కష్టం వచ్చినా.. బాధ కల్గినా తనకే ఆ కష్టం వచ్చినట్లు భావించేది. పిల్లలకు ఏ చిన్న బాధ కలిగిన ఆమెనే బాధపడేది. పిల్లలను నానా కష్టాలు పడి పెంచి పోషించింది. మంచి విద్యా బుద్ధులు నేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. తమను ఉన్నత స్థానాల్లో ఉంచిన తల్లిని కంటికి రెప్పలా చూడాల్సిన కన్న బిడ్డలే పట్టించుకోవడం లేదు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేటలో గురువారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. వెంగంపేట గ్రామానికి బొడ్డు ముత్తయ్య భద్రమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు కాగా వీరికి నలుగురు కొడుకులు ఉన్నారు. గత పదేళ్ల క్రితం భర్త ముత్తయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు మృతిచెందాడు. దీంతో భద్రమ్మ తనకు చెందిన 5 ఎకరాల భూమిని నలుగురికి సమానంగా ఇచ్చింది. మిగిలిన ముగ్గురు కుమారులు వెంగంపేటలోనే కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈమె పెద్ద కోడలు కురవి మండలం మంగూరిగూడెంలో నివాసం ఉంటుంది. కాగా వృద్ధాప్యంలో ఉన్న భద్రమ్మ(80) జీవనం కొనసాగించడం కష్టంగా మారింది. దీంతో గ్రామపెద్దలు అంతా కలిసి భద్రమ్మ తన నలుగురు కుమారులు దగ్గర ఒక్కో నెల పాటు ఉండాలని తీర్పును ఇచ్చారు. దీంతో భద్రమ్మ ముగ్గురు కుమారుల దగ్గర మూడు నెలల పాటు జీవనం కొనసాగింది. కాగా చిన్న కుమారుడు తన వంతు అయిపోయిందంటూ తల్లిని గ్రామంలోని రైతు వేదిక వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

నిస్సాహయ స్థితిలో ఒంటరిగా ఉన్న భద్రమ్మను మాజీ సర్పంచ్ ఆవుల అశోక్ గమనించి ఆటోలో భద్రమ్మను తన పెద్ద కోడలు ఉంటున్న మంగూరుగూడెం గ్రామానికి పంపించారు. అక్కడి వెళ్లిన భద్రమ్మను పెద్ద కోడలు నేను చూడలేను.. నాకు చేతనైతలేదంటూ ఆ వృద్ధురాలి అదే ఆటోలో తిరిగి వెంగంపేట పంపించింది. కాగా ఆటో డ్రైవర్ భద్రమ్మను గ్రామంలోని బస్టాప్ వద్ద దింపి వెళ్లిపోయాడు. దీనిని గమనించి గ్రామస్థులంతా ఒక్కసారిగా గ్రామంలోని కోడళ్లను నిలదీశారు. దిక్కు తోచని స్థితిలో వెంగంపేటలోని ఇద్దరు కోడళ్లు మేము మా వంతు ఒక నెల రోజులు పాటు భద్రమ్మను చూసుకున్నామని మా లాగే ఆస్తిలో సమానంగా వాటా తీసుకున్న పెద్ద కోడలు ఇప్పుడు ఎందుకు చూడదంటూ మళ్లీ భద్రమ్మను తీసుకొని మంగూరిగూడెం వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News