Thursday, July 31, 2025

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సంపూర్ణ వికాసం సాధ్యం

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయులను సన్మానించిన డి.ఈ. ఓ
మన తెలంగాణ/మోత్కూర్:  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం తోనే విద్యార్థుల్లో సంపూర్ణ వికాసం కలుగుతుంది అని యాదాద్రి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ అన్నారు. మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతనంగా పాఠశాల లో చేరిన విద్యార్థుల కు స్వాగతం పలికి విద్యార్థుల తల్లిదండ్రుల నుసన్మానించారు. నూతనంగా పాఠశాల లో చేరిన విద్యార్థుల తో వారి తల్లిదండ్రులకు పాద పూజ చేయించి సన్మానించే వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీపిరెడ్డి గోపాల్ రెడ్డి అధ్యక్షత న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల కు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుందన్నారు.

Mothkur government school

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమైతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. విద్య తోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది అన్నారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అవి సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థుల కు సూచించారు..వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు.తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకులని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రుల ప్రవర్తనే విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని అన్నారు. పిల్లలను ప్రేమించడం అంటే వారు అడిగింది కొనివ్వడం కాదని పిల్లలకు మంచి విద్యను అందించాలని తాపత్రయ పడటం నిజమైన ప్రేమ అన్నారు. 6 నెలల్లో వచ్చే పంట కోసమే తల్లిదండ్రులు చాలా శ్రమిస్తారని, తల్లిదండ్రుల కలల పంటలైన వారి బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తారో గుర్తుంచుకొని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అఫిరోహించాలన్నారు.

Mothkur government school

తల్లిదండ్రుల పెంపకంపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు వారి సమయం కేటాయించాలన్నారు. చదువుతో సమాజంలో అసమానతలు తొలిగించవచ్చు అన్నారు. కార్యక్రమంలో ముందుగా పాఠశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రసంగాలు పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీనరసింహారెడ్డి సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్, కోక బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోక బిక్షం, తిరుమలగిరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దబ్బెటి శైలజ పాఠశాల పూర్వ విద్యార్థులు అవిశెట్టి ఆవిలిమల్లు గుజ్జ సోమ నరసయ్య ఉపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు అంజయ్య రాంప్రసాద్ శ్రీనివాస్ ధర్మారపు వెంకటయ్య ప్రవీణ్ కుమార్ వెంకటాచారి లలితా కుమారి రవీందర్ రెడ్డి రామకృష్ణ మంజుల కవిత జయశ్రీ రవికుమార్ స్వప్న కవిత సుధీర్ కుమార్ శశి కుమార్ వెంకటేశ్వర్లు అశోక్ శంకర్ వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు..

Mothkur government school

మీ పిల్లలకు చదువు రాక పోతే నన్ను అడగండి…హెచ్ ఎం.

తల్లిదండ్రులు మీ పిల్లలను 75 శాతం అటెండెన్స్ ఉండేలా పాఠశాల కు పంపి అప్పుడు వారికి చదువు రాక పోతే తనను అడగవచ్చు నని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీపిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల కు వచ్చి వారి చిన్నారులు ఏవిధంగా చదువుతున్నారు అని తెలుసుకోవాలి అని,ఇంకా ఏమైనా మార్పు కావాలంటే దానికి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వవచ్చునని తెలిపారు. దాతల సహకారం తో పాఠశాల లో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News