Tuesday, July 29, 2025

నిరుపేద కుటుంబానికి మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని కొత్త బస్టాండ్ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన మెకానిక్ వాసం నారాయణ ఇటీవల గుండెపోటు తో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు అవివాహిత కుమార్తెలు ఉన్నారు. స్పందించిన మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ దాతల సహకారంతో సేకరించిన రూ.22,500 చెక్కును ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు అవిశెట్టి అవిలిమల్లు చేతుల మీదుగా మృతుని కుమార్తెలకు స్వయంగా అందజేశారు. సోషల్ మీడియాలో మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరు వాట్సప్ గ్రూప్ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాట్సప్ గ్రూప్ సభ్యులు ధబ్బేటి సోంబాబు, కారుపోతుల వెంకన్న, బొల్లెపల్లి శ్రావణ్ , మొరిగాల వెంకన్న, కోమటి జనార్దన్, మర్రి అనిల్, ఇండ్ల రాంప్రసాద్, బయ్యని రాజు ,మర్రి ఆనందం, కడమంచి రమేష్, కోల శ్రీనివాస్, మన్నే కరుణాకర్మ డిపెళ్లి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News