Sunday, July 27, 2025

ఎంఎల్ఎలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్టులు: ఎంపి చామల

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా మారారని భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. బిఆర్‌ఎస్ మాజీ మంత్రులు కె. తారక రామారావు, టి. హరీష్ రావు ఖాళీగా ఉన్నప్పుడు మధ్యలో ఈ ఇద్దరు దూరి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా ఏదో ఒకటి మాట్లాడి వెళుతుంటారని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. బిసిల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రయత్నంతో దేశానికి ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. కెటిఆర్‌ను ఎవరూ గుర్తించకపోవడంతో ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

మరో వైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దొరల వద్ద మార్కులు కొట్టేయాలని ఏదేదో అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. టివీల్లో కనిపిస్తే పాపులారిటీ వస్తుందని జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి భావిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గురించి మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఏమి అర్హత ఉన్నదని మీరు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల బంక మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రెడ్డి అంటించిన బంకేనని ఆయన దుయ్యబట్టారు. బై ఎలక్షన్లు, కలెక్షన్లు తప్ప తెలంగాణ ఉద్యమానికి చేసింది ఏమీ లేదని చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఉద్యమ సమయంలో చేసిన దోపిడి సామాన్యమైనది ఏమీ కాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News