Monday, August 25, 2025

దమ్ముంటే తెలంగాణలో దొంగ ఓట్లు తేల్చండి:ఎంపి డికె అరుణ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉన్నందున ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే దొంగ ఓట్లు ఎన్నో తేల్చాలి.. అని బిజెపి లోక్‌సభ సభ్యురాలు డికె అరుణ సవాల్ విసిరారు. తెలంగాణలో అధికారంలో ఉండి దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు కూడా దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారా? అని ఆమె సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. దొంగ ఓట్ల గురించి తేలిస్తే దొంగలెవరో, దోషులెవరో తేలిపోతుందన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పాట్లు పడుతున్నదని ఆమె విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలోగా దొంగ ఓట్ల గుట్టు విప్పండి అని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని తమ పార్టీ చాలా కాలంగా చెబుతున్నదని ఆమె గుర్తు చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్య నలిగిపోతూ అసహనంతో మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. దేవుడు, ధర్మం గురించి మాట్లాడితే తప్పేమిటీ? బిక్షం అడుకున్నట్లా? అని ప్రశ్నించారు. మీకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే కుల రాజకీయాలు చేసే పార్టీ అని ఆమె విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడి సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని డికె అరుణ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News