- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గాయపరిచిందని, సిఎం రేవంత్ రెడ్డి సర్కారు తీరు అభ్యంతరకరంగా ఉందని మహబూబ్‌నగర్ బిజెపి ఎంపి డికె అరుణ తెలిపారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో మిస్ వరల్ పోటీ భాగస్వాముల పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విదేశీ సుందరీమణుల కాళ్లకు నీళ్లు పోసి తుడిపించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలపై మోపడం అత్యంత బాధాకరం, అవమానకరం అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్లు కడిగించడమంటే ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
- Advertisement -