హైదరాబాద్: సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉన్నద మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. నగర శివారులోని బైరామల్‌గుడా వద్ద ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఐటి, సోషల్ మీడియా వర్క్ షాప్‌ను బిజెపి ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈటల ప్రసంగిస్తూ కేంద్రం ఇచ్చే నిధులతో చేపట్టే పథకాలకు లోగడ బిఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ తామే చేపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అబద్దాలు, మోసాలు చేస్తూ బతికే వారిని బట్టబయలు చేసేదే సోషల్ మీడియా అని అన్నారు. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండాలంటే సరైన సమాచారం తెలిసి ఉండాలని, వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటి ఉండాలని, తక్కువ లైన్లలో ఎక్కువ సమాచారం అందించగలిగే సమర్థత ఉన్న వారే సోషల్ మీడియా వారియర్స్‌కు ఉండాలని అన్నారు. అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు సమగ్రంగా పని చేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు.
‘సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది’: కాంగ్రెస్ పై ఈటల ఫైర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -