- Advertisement -
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల పండుగ మేడారం సమ్మక్క- సారక్క జాతరకు సదుపాయాలు కల్పించడంలో భాగంగా రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, భక్తులకు రవాణా సౌకర్యాలు సులభతరం చేయాలని మల్కాజ్‌గిరి లోకసభ సభ్యులు ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వైద్య పరంగా, ఇతర కారణాలతో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఊరట కలిగించే విధంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని, అయోధ్య క్రాస్ రోడ్డు వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరారు.
- Advertisement -