Tuesday, September 2, 2025

కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందని కవితే చెప్పారు: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అవినీతిపరులకు బిజెపిలో చోటు లేదని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. మొన్న కాళేశ్వరం కూలిందని, నిన్న బిఆర్ఎస్ కూలిందని అన్నారు. ఈ సందర్భంగా ఎంపి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం 3 పిల్లర్లు కూలిపోతే, బిఆర్ఎస్ మూడు ముక్కలైందని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తును స్వాగతిస్తున్నామని అన్నారు. ఇన్నాళ్లు సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాలయాపన చేశారని ఎంపి లక్ష్మణ్ ప్రశ్నించారు. సిబిఐకి ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితే చెప్పారని తెలియజేశారు. తెలంగాణ ఆస్తులను మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం కొల్లగొట్టిందని, కెసిఆర్ ను బలిపశువును చేశారని కవిత అంటున్నారని చెప్పారు. బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావుల అవినీతిలో కెసిఆర్ పాత్ర ఉందనుకోవాలని ఎంపి లక్ష్మణ్ పేర్కొన్నారు.

Also Read : చనిపోయిన నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు: మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News