Wednesday, May 21, 2025

ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఎంపి మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎంపి మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్‌, టిడిపి పార్టీలు కలిసి పోటీచేయబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు కమిషన్ ఇచ్చిన నోటీసులకు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మాజీ సిఎం కెసిఆర్ ఏమైనా చట్టానికి అతీతులా?.. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించక తప్పదని మల్లు రవి అన్నారు. కాగా, బిఆర్ఎస్, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని కెసిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News