- Advertisement -
మెదక్ లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు ప్రసంగిస్తూ నీటి పారుదల ప్రాజెక్టుల అంశంపై మంగళవారం కాంగ్రెస్,బిఆర్‌ఎస్ నాయకులు డ్రామా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్న సమాచారం తెలుసుకున్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ముఖ్యమంత్రికి సవాల్ విసిరి ప్రెస్ క్లబ్‌కు వచ్చి కూర్చున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో కెటిఆర్ కోసం వేచి చూడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -