Tuesday, July 8, 2025

ఎంఆర్‌పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లోని బాబు జాగ్జీవన్ రామ్ చౌరస్తా లో సోమవారం ఎంఆర్‌పిఎస్ 31వఆవిర్భావ దినోత్సవ వేడుకలలో  ఎంఆర్‌పిఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్‌పిఎస్ మోత్కూర్ మండల అధ్యక్షులు కూరెళ్ల శ్రీరాములు, టౌన్ అధ్యక్షులు, గజ్జెల్లి వినోద్ లు ఎంఆర్‌పిఎస్ జెండా నుఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంద కృష్ణ మాదిగ 3 దశాబ్దాలుగా ఎంఆర్‌పిఎస్ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడని, భారత దేశం లోనే కనివిని ఎరుగని రీతిలో ఉద్యమాన్ని మందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత మంది విమర్శలు చేసిన వెనుకడుగు వేయలేదన్నారు.

ఎబిసిడి వర్గీకరణ అనేది న్యాయమైన కోరిక అలాగే కృష్ణ మాదిగ చేసే పోరాటం నూటికి నూరు శాతం కరెక్ట్ అని భారత దేశ అతన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్ట్ తీర్పు నివ్వడం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పుకు అనుకూలంగా రిజర్వేషన్లులు అమలు పరచడం అన్న పట్టుదల కు నిదర్శనం అన్నారు. ఎబిసిడి వర్గీకరణ ఫలాలు అందుకొని ఎస్ సి సామాజిక వర్గం యువత ఉద్యోగాల్లో లో మందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఉద్యమాల పితామహుడు అభినవ అంభేడ్కర్, పద్మశ్రీ, మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ఎంఆర్‌పిఎస్మాజీ జిల్లా కార్యదర్శి పల్లె భిక్షం, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు. మెంట నగేష్, నాయకులు ఎర్రవెల్లి నర్సయ్య, గజ్జెల్లి మహేష్, వడ్డేపల్లి జగన్, కూరెళ్ల యాదగిరి, వస్తుప్పుల కృష్ణ, ఇందిరానగర్ కిష్టయ్య, చంద్రయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News