Friday, September 5, 2025

ముంబైకి హై అలర్ట్

- Advertisement -
- Advertisement -

అంగరంగ వైభవంగా గణేశ్ నిమజ్జన ఉత్సవంకోసం ముంబై మహానగరం సన్నద్ధమవుతున్న వేళ.. డజన్ల కొద్దీ బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు సందేశం రావడంతో నగరం ఉలిక్కిపడింది. పోలీసులు, రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 34 కార్లలో మానవబాంబులను విధ్వంసం సృష్టించేందుకు సిద్ధం చేశామని, అది మొత్తం నగరాన్ని అల్లకల్లోలం చేస్తుందని ఆ బెదిరింపు సందేశంలో పేర్కొన్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూమ్ లోని వాట్సాప్ హెల్ప్ లైన్ కు బెదిరింపు మెస్సేజ్ వచ్చింది. శనివారం నాడు అనంత చతుర్దశి. వినాయక చవితి నాటి నుంచి పూజలందుకున్న గణేశ్ ప్రతిమల నిమజ్జన కార్యక్రమం కోసం పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తున్న వేళ ఈ సందేశంతో కలకలం చెలరేగింది. లష్కర్ -ఏ- జిహాదీ గా పరిచయం చేసుకున్న వ్యక్తి

ఈ సందేశంలో 14 మంది పాకిస్తానీ టెర్రరిస్ట్ లు భారతదేశంలో ప్రవేశించారని, 400 కిలోల ఆర్డీఎక్స్ ను వినియోగించి మహా నగరంలో పేలుళ్లు జరుపుతామని, అది కోటి మందిని చంపగలదని ఆ బెదిరింపు లేఖలో పేర్కొన్నారు.బెదిరింపు లేఖలో అలర్ట్ అయిన ముంబై పోలీసులు, భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ఈ బెదిరింపును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తూ, టెర్రరిస్ట్ నిరోధక దళానికి సమాచారం ఇచ్చారు. అనుమానాస్పదంగా ఎవరు కన్పించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని , పుకార్లను నమ్మవద్దని పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై నగరంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి బేస్ మెంట్ ల వరకూ తనిఖీ చేస్తున్నారు. భద్రతా దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొంటాయని, సీనియర్ అధికారి విలేకరులతో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News