Monday, July 21, 2025

2006 ముంబై రైలు పేలుళ్ల కేసు.. 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

- Advertisement -
- Advertisement -

ముంబై: 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా సోమవారం బాంబే హైకోర్టు ప్రకటించింది. జస్టిస్ అనిల్ కిలోర్, శ్యామ్ చందక్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం ఉదయం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులపై ఉన్న అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని పేర్కొంది. గతంలో విధించిన మరణశిక్షలు, జీవిత ఖైదులను సమర్థించడానికి నిరాకరించిన న్యాయస్థానం.. వారికి విధించిన శిక్షలను రద్దు చేసింది.

కాగా, జూలై 11, 2006న రద్దీ సమయంలో పశ్చిమ రైల్వే లైన్‌లోని ముంబై సబర్బన్ రైళ్లలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ వరుస బాంబు దాడుల్లో 189 మంది మృతి చెందగా.. 800 మందికి పైగా గాయపడ్డాయి. ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రెషర్ కుక్కర్ కంటైనర్లలో బాంబులు పెట్టి పేల్చిన సంఘటనలు ముంబై నగరాన్ని తీవ్ర భయాందళనకు గురిచేశాయి. ఈ బాంబు దాడుల్లో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. 2015లో ప్రత్యేక కోర్టు ఈ కేసులో 12 మందిని దోషులుగా నిర్ధారించింది. వారిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా.. మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. తర్వాత దోషులు తమ శిక్షలపై న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో బాంబే హైకోర్టు 12 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News