Thursday, July 17, 2025

విద్యార్థిని హత్య ఘటన తీవ్రంగా కలచి వేసింది: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara lokesh) తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనపై లోకేష్  స్పందించారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News