హర్యానాలోని గురుగ్రామ్‌లో బాలీవుడ్ గాయకుడు రాహుల్ ఫజిల్పూరియాపై హత్యాయత్నం జరిగింది. స్థానిక ఎస్‌పిఆర్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనలో సింగర్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు మూడు రౌండ్ల కాల్పలు జరిపాడు. ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ ఇక్కడి నుంచి జననాయక్ జనతా పార్టీ (జెజెపి) అభ్యర్థిగా పోటీ చేసి బిజెపికి చెందిన ముఖేష్ శర్మ చేతిలో ఘోరంగా ఓడారు. తన పలురకాల పాటలతో ఫజిల్పూరియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షలకు పైగా .మంది ఫాలోయర్స్ ఉన్నారు. బిగ్‌బాస్ ఒటిటి 2 విజేత ఎల్విష్ యాదవ్‌కు ఈ గాయకుడు సన్నిహితుడు. ఎల్విష్ యాదవ్ రేవ్ పార్టీల్లో పామువిషం వాడుతున్నాడని 2ం23లో ప్రచారం జరిగింది. ఈ కేసులో విచారణ దశలో ఎల్విష్ తనకు స్నేక్ విషం ఈ సింగర్ నుంచి అందిందని వెల్లడించాడు. ఇప్పటి కాల్పుల ఘటనకు ఈ కేసుకు సంబంధం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.
బాలీవుడ్ సింగర్ పై హత్యాయత్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -