సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-కార్తీక్ చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఈ గొప్ప సినిమా నన్ను మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ప్రేరణనిచ్చింది. సినిమా చూస్తున్నప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి దగ్గరగా ఉందనిపించింది. ఇక ఆడియన్స్ థియేటర్‌లో గొప్ప సంగీత అనుభూతిని పొందడం చాలా ఆనందాన్నిచ్చింది.
ఇందులో మిరాయ్ ఆయుధానికి లార్డ్ శివ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బిజి) ఉపయోగించడం జరిగింది. శ్రీ రాములవారి ఆయుధం అయినప్పటికీ దానికి పినాక అనే పేరు ఉంది. ఆస్ఫూర్తితో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయడం జరిగింది. ఇక స్టోరీని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్కోర్ కూడా రాయడం జరిగింది. ఈ సినిమా రాములవారి పోర్షన్ చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. అందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా పవర్‌ఫుల్‌గా చూపించడానికి సమయం పట్టింది. ఈ సినిమా కోసం రకరకాల జానర్స్‌ని వాడడం జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నాలుగు జానర్స్‌లో సౌండ్‌ని మిక్స్ చేసి చూపించే అవకాశం రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే నాలుగు ప్రాజెక్ట్ చేస్తున్నాను” అని అన్నారు.