- Advertisement -
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది. (peddi) అయితే శరవేగంగా ఈ సినిమాను పూర్తిచేస్తున్నాడు రామ్ చరణ్. సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రిలీజైంది. సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభించాలని యూనిట్ నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వినాయక చవితి స్పెషల్‌గా ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్‌ని లాంచ్ చేస్తారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్ సినిమాకు రెహ్మాన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
- Advertisement -