యంగ్ హీరో నరేష్ అగస్త్య దర్శకుడు విపిన్ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ’మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ( meghalu cheppina prema khatha)తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఉమా దేవి కోట, డైరెక్టర్ విపిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ప్రేమ ఎలా పుడుతుంది అనేది ఈ కథలో చూస్తారు. -ఇందులో రాధిక హీరో గ్రాండ్ మదర్‌గా కనిపిస్తారు.
-ఇందులో హీరో శాస్త్రీయ సంగీతం కోసం చేసిన సేవ ఊహించలేము. అలాంటి ఒక క్యారెక్టర్‌ని పరిచయం చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. జస్టిన్ ప్రభాకర్ (Justin Prabhakar) అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో విజువల్స్ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిస్తాయి. తెలుగులో చాలా రోజుల తర్వాత మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ వచ్చిందని ప్రేక్షకులు అనుకుంటారు. రెహమాన్, కృష్ణ కాంత్ అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఇందులోని పాటలు ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. సినిమాలో హీరో నరేష్ అగస్త్య అద్భుతంగా నటించాడు”అని అన్నారు.