విభిన్న కథ, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలు. ఇటీవల తనికెళ్ల భరణి రిలీజ్ చేసిన ‘హర హర శంకరా’ అనే పాట కూడా మంచి ప్రశంసల్ని దక్కించి, మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ ‘కల్లు కొట్టు కాడ’ అంటూ సాగే మరో మంచి మాస్ ఎనర్జిటిక్ నంబర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ప్రత్యేక గీతాన్ని సూరన్న రచించారు. సూరన్న, రేలారే రేలా గోపాల్, సుజాత వాసు కలిసి ఆలపించిన ఈ పాటకు వెంకీ వీణ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక లిరికల్ వీడియోని చూస్తుంటే సత్య మాస్టర్ కొరియోగ్రఫీ మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ .. “మటన్ సూప్’ టైటిల్ చాలా బాగుంది. యంగ్ టీం చేసిన ఈ ప్రయత్నానికి పెద్ద సక్సెస్ దక్కాలి” అని అన్నారు. చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. “సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే మా సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మల్లిఖార్జున ఎలికా, రామకృష్ణ సనపల, హీరో రమణ్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, గీత రచయిత సూరన్న, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్, గోవింద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Also Read : రెండో పాట వచ్చేస్తోంది