Tuesday, May 20, 2025

ఆ ఘటనతో నా గుండె బద్దలైంది: మిస్ కెనడా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛార్మినార్ సమీపంలోని గుల్జార్ చౌరస్తాలోని (Gulzar House) ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా ఈ ఘటనపై మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కి వచ్చిన మిస్ కెనడా ఎమ్మా మారిసన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలిసి గుండె బద్దలైపోయింది అని ఆమె సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.

‘‘పాతబస్తీలోని (Gulzar House) అగ్నిప్రమాద ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి నా హృదయం బరువెక్కింది. అందులోనూ మరణించిన వారిలో 8 మంది చిన్నారులు ఉండటం బాధకరం. ఈ ప్రమాదం కారణంగా ఆయా కుటుంబాల బాధను నేను వర్ణించలేను. పోటీ కోసం ఇక్కడకు వచ్చిన మాకు ఇక్కడి ప్రాంతం వారు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. ఇప్పుడు వాళ్లు వేదనలో ఉండటం చూసి గుండె బద్దలైపోయింది. ఈ ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ కుటుంబాల కోసం మనమంతా ప్రార్థిద్దాం’’ అంటూ ఎమ్మా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఆదివారం ఉదయం గుల్జర్ హౌస్‌లో ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోడీ నివాసంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రహ్లాద్ కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎసిలు పేలి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News