Thursday, September 4, 2025

మైహోమ్ భుజా లడ్డూ @ 51 లక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గంలోని మైహోమ్ భుజాలో వినాయకుడి లడ్డూ భారీ ధర పలికింది. గణేష్ లడ్డూ వేలం పాటలో ఇల్లందుకు చెందిన గణేష్ అనే వ్యక్తి రూ.51,77,77కు దక్కించుకున్నాడు.  గత సంవత్సరం ఇక్కడ లడ్డూను రూ.29 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు.  గత సంవత్సరం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని గణేశ్ లడ్డూ రూ.1.87 కోట్లు రికార్డు ధర పలికిన విషయం విధితమే. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో ఒక కోటి 87 లక్షల రూపాయలకు విల్లాలోని కమ్యూనిటీ వారు వేలంలో దక్కించుకున్నారు. గత సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డూను కొలను శంకర్ రెడ్డి రూ.30,01000 దక్కించుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News