సిద్ధిపేట: అయన దేశ రక్షణ కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికుడు (Indian Soldier). కానీ అతనికి స్వగ్రామంలో అన్యాయం జరిగింది. దేశ పరిరక్షణ కోసం కుటుంబానికి, సొంత ఊరికి దూరంగా ఉంటున్న అతని భూమిని కబ్జా (Land Occupied) చేశారు. అంతేకాక.. ఆ భూమి విషయంలో అతని కుటుంబసభ్యులను బెదిరించారు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా ఆ సైనికుడు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా అక్భర్‌పైట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లెకి చెందిన రామస్వామి (Indian Soldier) జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన స్వగ్రామంలో విఆర్‌ఒ సోదరుడు తన భూమిని కబ్జా (Land Occupied) చేశాడని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్టివొ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదు అని అన్నారు. అంతేకాక.. ఆక్రమణదారులు తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
ఏమైనా సరే తన భూమిని దక్కించుకొనే వరకూ పోరాడుతానని రామస్వామి స్పష్టం చేశారు. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. అలాగే తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని అతను వీడియోలో వేడుకున్నారు. అయితే కబ్జా చేసింది విఆర్‌వొ సోదరుడు కావడంతో ఎవరూ నోరు మొదపడం లేదని అన్నారు. దయచేసి సిఎం కలగజేసుకొని తమ సమ్యసలసు పరిష్కారించాలని ఆయన కోరారు.