Sunday, June 8, 2025

హృదయాన్ని హత్తుకునే భావోద్వేగంతో..

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో కిషోర్ తేజా, సాత్విక లీడ్ రోల్స్‌లో నటించిన మై లవ్ (my love) ఆల్బమ్ సాంగ్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఎస్‌కెటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వాకాడ అప్పారావు నిర్మించిన ఈ ఆల్బమ్ ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే భావోద్వేగంతో కూడిన సంగీతం, రిఫ్రెషింగ్ విజువల్స్‌తో అదిరిపోయింది. ఈ సాంగ్ కి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా, క్రాంతి ఆచార్య మనసుని కదిలించే సంగీతాన్ని అందించారు. కపిల్ కపిలన్ అద్భుతంగా ఆలపించిన ఈ పాట మ్యూజికల్ లవర్స్‌(Musical Lovers) ని మైమరపించింది.

ఈ పాటలో కిషోర్ తేజా, సాత్విక కెమిస్ట్రీ లవ్లీగా వుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిషోర్ తేజ మాట్లాడుతూ “ఈ పాట తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రాంతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని అన్నారు. డైరెక్టర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ “మంచి కంటెంట్‌తో తీస్తే ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచి వ్యూస్ ఇస్తారు. ఈ సాంగ్‌ను కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి గీత, రమణ, దివి, సాత్విక పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News