Sunday, June 15, 2025

కోలీవుడ్ డైరెక్టర్‌తో ‘కింగ్ 100’ మూవీ

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాల్లో కూడా ఆయన స్పెషల్ రోల్స్ పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరోవైపు, కూలీ మూవీని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమాలో నాగ్ రోల్.. పవర్ ఫుల్ గా ఉండనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా.. నాగార్జున తన 100వ చిత్రాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్ డైరెక్టర్ (Kollywood director) రా కార్తీక్ దర్శకత్వం వహిస్తారని.. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సినిమా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది.నాగ్ మూవీతోనే ఆయన టాలీవుడ్ కు రానున్నారట. కింగ్ 100 అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని.. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని తెలుస్తోంది. జూలైలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. ఆగస్టు 29వ తేదీన నాగ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానుందట. అయితే నితం ఒరు వానం అనే తమిళ్ మూవీతో కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ కార్తీక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News