- Advertisement -
నాగాలాండ్ ప్రభుత్వం ఐఎఎస్ అధికారి రేణి విల్ఫ్రెడ్‌ను బాధ్యతల నుంచి తప్పించింది. అధికారి తన పదవీ హోదా దుర్వినియోగంతో తమను లైంగికంగా ,మానసికంగా వేధించాడని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. దీనితో అన్ని విషయాల పూర్తి స్థాయి నిర్థారణకు అల్ఫ్రెడ్‌ను సస్పెండ్ చేశారు. నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎజె అలాం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. ఆలిండియా సర్వీసెస్ సంబంధిత క్రమశిక్షణా చర్యల నిబంధనలు 1969 పరిధిలో ఈ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ అధికారి ఐఎఎస్‌గా కార్యనిర్వాహక బాధ్యతల్లో ఉన్నప్పుడు ఉద్యోగినులను అసభ్య రీతిలో వేధించినట్లు, కొందరికి లైంగిక కోరికల సందేశాలతో వెకిలి చేష్టలకు దిగేవాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి వీటి నిజానిజాల నిగ్గు తేలేవరకూ అల్ఫ్రెడ్‌పై చర్య కొనసాగుతుంది.
- Advertisement -